Lady Aghori: గుంటూరులో అనిల్ బెహరా అనే వ్యక్తితో మహిళ అఘోరికి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు వచ్చిన లేడీ అగోరిని అదుపులోకి తీసుకొని వివాదాలు వద్దంటూ నల్లపాడు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా లేడీ అఘోరి మాట్లాడుతూ.. అనిల్ బెహరా అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.. రాజేష్ నాథ్ అనే వ్యక్తికి అనిల్ బెహరా బినామీ అని ఆరోపించింది. రాజేష్ నాథ్ రాసలీలలు బయట పెట్టిన నాపై దాడి చేయాలని అనిల్ ప్రయత్నం చేస్తున్నాడు.. అనిల్ బెహరా ఛాలెంజ్ చేస్తేనే.. నేను ఛాలెంజ్ చేసి మరి గుంటూరు వస్తానని చెప్పాను..
Read Also: RS Brothers: అత్తాపూర్లో ఆర్ఎస్ బ్రదర్స్ 13వ షోరూం ఓపెన్ చేసిన నిధి అగర్వాల్!
అయితే, అనిల్ బెహరా అనే వ్యక్తి ఈ రోజు నాకు వాట్సాప్ లో వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు అని లేడీ అఘోరి వెల్లడించింది. అందు కోసమే అతడితో మాట్లాడెందుకు గూంటురు వచ్చాను.. కానీ, పోలీసులు నన్ను పీఎస్ లో ఉంచి కౌన్సిలింగ్ ఇచ్చారు.. వివాదాలు పెట్టుకోవద్దని వాళ్లు నాకు చెప్పారు అని ఆమె తెలిపింది. అనిల్ బెహరాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాను అని లేడీ అఘోరి చెప్పుకొచ్చింది.