కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. చిన్న, పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులకు సైతం కరోనా సోకింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు.
Read Also: కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి.. వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్
కాగా తనతో సన్నిహితంగా ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని కొడాలని నాని కోరారు. ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొడాలి నాని ఆరోగ్యం పట్ల ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఏఐజీ డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. మరోవైపు టీడీపీ నేత వంగవీటి రాధాకు కరోనా సోకింది. ఆయన కూడా హైదరాబాద్ ఏఐజీలోనే చికిత్స తీసుకుంటున్నారు.
