కేసీఆర్‌ను టచ్‌ చేసి చూడండి.. వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్‌

దమ్ముంటే కేసీఆర్‌ను టచ్‌ చేసి చూడండి.. మా దమ్ము ఏంటో చూపిస్తామని సవాల్ విసిరార్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నాయా అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని ఆయన అన్నారు. బీజేపీ పాలితరాష్ట్రల్లో రైతుబంధు ఉందా ? తెలంగాణలో వ్యవసాయ భూములకు భారీగా ధరలు.. ఆంధ్రాలో డమాల్ అంటూ వ్యాఖ్యానించారు. ఎర్రిలేసిన కుక్కల్లాగా అర్వింద్, సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ బుడ్డారఖాన్… సంజయ్ మెంటల్… అర్వింద్ ఏమి లేనోడు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

Read Also: బీజేపీ నుంచి కరిపే గణేష్‌ బహిష్కరణ: బస్వలక్ష్మీ నర్సయ్య

మధ్యప్రదేశ్ నుంచి ఒక కుక్క వచ్చి కేసీఆర్ మీద మొరిగింది… అస్సాం నుంచి వచ్చి ఇంకొడు మొరుగుతున్నాడని మండిపడ్డారు. ఒకనాడు ఆంధ్రోళ్లు తెలంగాణ భూములు కొనేది. నేడు తెలంగాణ రైతులు ఆంధ్రాలో భూములు కొంటున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్టాల నుంచి కూలీలుగా తెలంగాణకు రావడం లేదా ? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ వాళ్లు బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్నారా అనేది బీజేపీ నేతలు చెప్పాలని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఇట్లా ఉంది.. ఇద్దరు అబద్దాలకోర్లు మొరుగుతున్నారు… ఒక్కడికి నెత్తి మీద ఉన్నది. లోపల లేదని బండి సంజయ్ పై మండిపడ్డారు. నిజామాబాదోడికి నెత్తిమీద లేదు, లోపల కూడా లేదంటూ అరవింద్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని మాటతప్పిన సిగ్గులేని వాడు మాట్లాడుతున్నాడంటూ అరవింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు వేముల ప్రశాంత్‌రెడ్డి.

Related Articles

Latest Articles