Site icon NTV Telugu

ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు…

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఆ కర్ఫ్యూ కారణంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో దానిని కొనసాగిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కర్ఫ్యూను పొడిగించింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్ కోవిడ్ పై నిర్వహించిన సమీక్షలో… స్వల్ప మార్పులు చేస్తూ జూన్‌ 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే జూన్‌10 తర్వాత ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సమయంలో సడలింపు చేసారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల్లో ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నడవనున్నాయి. ఈ సమీక్షకు వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇంకా కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ సన్నద్ధత పై సమీక్షించనున్నారు సీఎం జగన్.

Exit mobile version