NTV Telugu Site icon

Constable Surendra: కానిస్టేబుల్ సురేంద్ర కేసులో నిందితులు ఎవరంటే?

Murder1

Murder1

ఏపీలో సంచలనం కలిగించింది కానిస్టేబుల్ సురేంద్ర హత్య. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈహత్యకేసులో నిందితులను గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి సి.సి.కెమేరాలో సంఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. హత్యకు పాల్పడింది ముగ్గురు రౌడీషీటర్లు, మరో ఇద్దరు నేరస్తులుగా పోలీసులు గుర్తించారు.

తిరుమల వెళ్ళడానికి పాడైపోయిన బ్యాగ్ ను కుట్టించుకోవడానికి సంఘటన స్థలం వద్ద షాప్ కు వచ్చారు సురేంద్ర. పక్కనే వున్న టాటూ సెంటర్ లో వున్న రౌడీ షీటర్లు ,సురేంద్ర మధ్య ఘర్షణ జరిగింది. మద్యం బాటిళ్ళతో సురేంద్ర పై దాడికి పాల్పడ్డారు నిందితులు. పారిపోతున్న సురేంద్రను ఆటోలో ఎక్కించుకున్న రౌడీ షీటర్లు ముందుకు తీసుకువెళ్లారు. ఆటోలో సురేంద్రను కత్తులతో పొడిచి, పరారయ్యారు రౌడీ షీటర్లు. హత్యకు పాల్పడిన రౌడీ షీటర్ల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి మర్డర్ కేసులో ట్విస్ట్

తిరుపతిలో రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి నారాయణ స్వామి మర్డర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పది రోజుల క్రితం ఇంట్లో గోల్డ్ చైన్ పోయిందని ఎంఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు నారాయణ స్వామి. ఎంఆర్ పల్లి పోలీసులు పట్టించుకోక పోవడంతో స్పందనలో ఎస్పీ్కి ఫిర్యాదు చేశారు నారాయణ స్వామి. కేసును క్రైంకు రెఫెర్ చేశారు ఎస్పీ. నారాయణ స్వామి ఇంటి పక్కన వారిని విచారించారు క్రైం పోలీసులు.

కేసు విచారణలో ఉండగా నారాయణ స్వామిని కొట్టి చంపేశారు ఇంటి పక్కన ఉన్న దుండగులు. ఎంఆర్ పల్లి పోలీసులు స్పందించి ఉంటే హత్య జరిగేది కాదంటున్నారు హతుడి కుటుంబ సభ్యులు. ఎంఆర్ పల్లి పోలీసులు నిర్లక్ష్యం వల్లే నారాయణ స్వామి మృతి చెందాదంటున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దుండగులను అరెస్ట్ చేయాలని నారాయణ స్వామి కుటుంబీకులు కోరుతున్నారు.

Road Terror in Prakasam: కంభం సమీపంలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం