Site icon NTV Telugu

ఇది కూత‌లు, కోత‌ల బ‌డ్జెట్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తుల‌సిరెడ్డి.. ఆర్థిక‌మంత్రి బుగ్గన రాజేంద్రుడి బడ్జెట్ పిట్టల రాయుడి బ‌డ్జెట్.. ఇది కూతల బడ్జెట్, కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేసిన ఆయ‌న‌.. మొదటి , రెండవ బడ్జెట్ లో కూతలు పెట్టిన ఈ ప్రభుత్వం.. మూడవ బడ్జెట్‌ లో ఎంతో కోత పెడుతోంద‌న్నారు.. వ్యవసాయం , సాగునీటి రంగం, వైద్య , హౌసింగ్ రంగాలకు కేటాయించిన దానికంటే ఖర్చు పెట్టినది చాలా చాలా త‌క్కువ‌ని ఆరోపించిన తుల‌సిరెడ్డి.. ఆ రంగాల ప‌ట్ల వైఎస్ జగన్ సర్కార్ ది చారిత్రాత్మక నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారు.. ఇక‌, అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింద్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంద‌న్నారు.. ఇది వినాశక , తిరోగమన బడ్జెట్‌గా కామెంట్ చేశారు తుల‌సిరెడ్డి.

Exit mobile version