APPSC: గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులారా అలెర్ట్.. ఇక, ఈ సర్టిఫికెట్ ఉండాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకానికి ఇక నుంచి కంప్యూటర్ ప్రొఫీషియన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేసింది.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సీపీటీ (కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్టు) పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: Yogi Adityanath: “వాళ్లను మట్టిలో కలిసేస్తాం”.. సమాజ్ వాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్యనాథ్
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఇక, వంద మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహించనున్నట్టు ప్రకటించిన సాధారణ పరిపాలనా శాఖ.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్ధులు కనీసంగా 30 మార్కులు, బీసీలకు 35, ఓసీలకు 40 మార్కులను సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టంలు, విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.. గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధన వర్తించదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్.. అంటే, కొత్త రూల్స్ ప్రకారం.. గ్రూప్ – 2 లేదా గ్రూప్ -3 నోటిఫికేషన్ల ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్టు (సీపీటీ) పాస్ కావాల్సిందే. సీపీటీ పరీక్షలో.. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలకు సంబంధించిన అంశాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్.. బేసిక్ కంప్యూటింగ్.. విండోస్.. ఇంటర్నెట్ తదితర అంశాల్లో అభ్యర్థులు పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?