NTV Telugu Site icon

Kurnool Medical College: సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు.. యూజీసీ కి ఫిర్యాదు

Untitled 3

Untitled 3

Kurnool: కళాశాలలో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం. అయితే ఈ విషయం తెలిసీ కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్స్ ని ఇబ్బంది పెడుతుంటారు. తాము సీనియర్ల కనుక తాను చెప్పిందే చెయ్యాలని ఒత్తిడి చేస్తారు. అయితే సీనియర్ విద్యార్థులు తెస్తున్న ఒత్తిడిని కొందరు జూనియర్ విద్యార్థులు భరించిన.. చాలా మంది సున్నిత మనస్తత్వం కలిగిన విద్యార్థులు మాత్రం ఒత్తిడిని తాళలేక అధికారులకు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలులో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. కర్నూలు మెడికల్ కాలేజి లో సీనియర్లు తమ సీనియారిటీని చూపంచుకోవడానికో.. లేక బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారో గాని వాళ్ళ రికార్డ్స్ రాసిపెట్టాలని, అలానే వాళ్లకు భోజనాలు తీసుకురావాలని జూనియర్ విద్యార్థులను ఒత్తిడి చేశారు.

Read also:Salaar Trailer: సార్… ట్రైలర్ లో లాగా సినిమాలో కూడా ప్రభాస్ మధ్యలో రాడు కదా?

దీనితో సీనియర్ విద్యార్థులు కలిగిస్తున్న ఒత్తిడిని తాళలేక కొందరు విద్యార్థులు యూజీసీ కి ఫిర్యాదు చేసారు. వాళ్ళు చేసిన ఫిర్యాదులో రికార్డులు రాయిస్తున్నారని, భోజనాలు తీసుకురావాలని సీనియర్ విద్యార్థులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్ కి సమాచారం ఇచ్చింది యూజీసీ. కాగా వారం క్రితం మెన్స్ హాస్టల్ గదిలో లో గంజాయి, మద్యం లభ్యమైంది. దీనితో కళాశాల ప్రిన్సిపాల్ మెన్స్ హాస్టల్ గదిలో మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన జరిగి వారం గడవక ముందే మళ్ళీ సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ యూజీసీ ఫిర్యాదు వెళ్ళింది. దీనితో ఈ కళాశాల మరోసారి వార్తల్లో నిలిచింది.