NTV Telugu Site icon

Tirumala Darshanam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

Tirumala

Tirumala

Tirumala Darshanam: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. వడ్డీకాసులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లలని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 65, 392 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 29, 015 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, హుండి ఆదాయం 4. 23 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Read Also: MLA Prakash Goud: బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్‌.. నేడు కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే..

ఇక, ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. సాయంత్రం పుష్పపల్లకిలో మలయప్పస్వామి దర్శనం ఉండటంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 15వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే, తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీ నుంచి 20 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగబోతున్నాయి. ఇందు కోసం జూలై 17వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తామని అర్చకులు వెల్లడించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు అప్పుడప్పుడు జరుగుతాయి.. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు జరుపుతారు.

Read Also: Nepal : పెను ప్రమాదం…కొండచరియలు విరిగి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60మంది గల్లంతు

అలాగే, ఇందులో భాగంగా జూలై 18న మొద‌టి రోజు ఉదయం ఉత్సవ‌మూర్తుల‌కు స్నప‌న‌తిరుమంజ‌నం, సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్రతిష్ఠ జరపగా, 19న గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్పణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేస్తామని అర్చకులు పేర్కొన్నారు. 20వ తేదీన ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్పణ, ‌సాయంత్రం కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, విఘ్నేశ్వరస్వామి, సుబ్రమణ్యస్వామి, చండికేశ్వర స్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.

Show comments