NTV Telugu Site icon

Cold Waves: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

Cold1

Cold1

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చంపేస్తోంది. కొండ ప్రాంతాల్లో ఉండేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకు, లంబసింగిలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో చలి కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. సిద్దిపేట జిల్లాలో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కి పడిపోయాయి కనిష్ట ఉష్ణోగ్రతలు.

Read Also:CM KCR : రేపు నాందేడ్‌కు సీఎం కేసీఆర్.. షెడ్యూల్‌ ఇలా..!
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 6.9కనిష్ట ఉష్ణోగ్రతగా నమోదు అయింది. కొమురం భీం జిల్లా సిర్పూర్ 7.7 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదవగా.. నిర్మల్ జిల్లా కుంటాలలో 9.9 డిగ్రీలుగా వుంది. మంచిర్యాల జిల్లా ర్యాలీ లో11.5 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు. సంక్రాంతి తర్వాత చలి తీవ్రత పెరిగిందని.. తెలంగాణలో దీని ప్రభావం మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ కూడా జారీ చేశారు.ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా చలి తీవ్రత 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తారు. రాబోయే వారం రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతాయని తెలిపింది.

ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల జిల్లాలకు నేడు ఆరెంజ్ అలర్ట్ ఉంది. కరీంనగర్, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అరకు పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అరకు వాలీ ని సందర్శించేందుకు ఉత్తమ సమయంగా భావిస్తారు. ఈ సమయంలో వాతావరణం ఈ ప్రాంత సందర్శనకు అలాగే ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి చలితీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కారణంగా తెల్లవారు జామునుంచి చలిగాలులు బాగా వీస్తున్నాయి. పొగమంచు కూడా వ్యాపిస్తోంది.

Read Also: Sunday Stothra parayanam live: ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..