సరదాల సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. సంక్రాంతికి ఇంకా నెలరోజుల టైం వుంది. ధనుర్మాసం కూడా ఇవాళే ప్రారంభం అయింది. ఇదిలా వుంటే.. సంక్రాంతి ప్రారంభానికి ముందే సరదా రాయుళ్ళు రెడీ అయిపోయారు. ఖాళీగా ఉండడం ఎందుకని కోడిపుంజులతో పందాలకు సై అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట ఈ కోడిపందాలు జరుగుతూనే వున్నాయి. టెంపుల్ సిటీ తిరుపతిలో కోడిపందేల రాయుళ్లు రెచ్చిపోయారు. తిరుపతి జిల్లాలో పోలీసుల దాడులకు భయపడి పందెంరాయుళ్ళు కాలువలో దూకడం సంచలనం కలిగించింది.
Read Also: Puri Jagannadh : ఆ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేదం.. జనవరి నుంచే అమలు
కోడి పందెం రాయుళ్ల తీరుపట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే… రేణిగుంట మండలం సుండికండ్రిగ కుమ్మరిపల్లె వద్ద మామిడి తోపులో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారంతో రైడ్ చేశారు పోలీసులు. అయితే పోలీసులు దాడి చేస్తారనే సమాచారం అందుకున్న పందెం రాయుళ్ళు పలాయనం చిత్తగించారు. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో కాలువలో దూకారు నలుగురు యువకులు. కాలువలో నుండి ఈదుకుంటూ బయటకు వచ్చారు ముగ్గురు యువకులు. అయితే, కాలువలో దూకిన వారిలో మనోహర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన వారు బయటకు వచ్చి నాలుగో వ్యక్తి గురించి వాకబు చేశారు. గల్లంతైన యువకుడు కోసం గాలిస్తున్నారు. కోడిపందాల సరదా ఒక యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. సినిమా టిక్ గా కాలువలో దూకడం, ఒకరు గల్లంతు కావడం విషాదం నింపుతోంది. గల్లంతయిన యువకుడి వివరాలు అందాల్సి వుంది.
Read Also: Gold Thieves: భక్తికథకు వచ్చి బంగారం గొలుసు కొట్టేసారుగా.. అంతేగా.. అంతేగా
