CM YS Jagan: రేపు విశాఖ, గుంటూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

Cm Ys Jagan

Cm Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వెస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. బుధవారం రోజు విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.. రేపు ఓ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి.. మరో వైపు మాజీ మంత్రి కూతురు పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారు.. రేపు విశాఖ వెళ్లనున్న ఆయన.. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్‌ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు ఏపీ సీఎం..

Read Also: CM KCR : ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

ఇక, విశాఖ, గుంటూరు జిల్లాల పర్యటన కోసం రేపు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సాయంత్రం 4 గంటలకు దాకమర్రి చేరుకుంటారు.. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.. నూతన దంపతులను ఆశీర్వదించిన తర్వాత తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి సాయంత్రం 6.30 గంటలకు నేరుగా మంగళగిరి చేరుకోనున్నారు సీఎం జగన్… సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొననున్న ఆయన.. నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం.. తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.