NTV Telugu Site icon

YS Jagan: సొంత జిల్లాకు సీఎం.. షెడ్యూల్‌ ఇదే..

Ys Jagan

Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా రాష్ట్రాన్ని చుట్టూస్తున్నారు.. జిల్లాల్లో పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, శంకుస్థాపనలను చేయడంపై దృష్టిసారించారు.. ఇక, సొంత జిల్లాలో మరోసారి పర్యటించానున్నారు ఏపీ సీఎం.. తన పర్యటనలో ప్రొద్దుటూరులో డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరుకాబోతున్నారు.. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

Read Also: Minister Kakani: బాబుకు సవాల్‌.. దమ్ముంటే రైతుల కోసం ఏం చేశారో చెప్పాలి..!

ఇక, సీఎం జగన్‌ టూర్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిస్తే.. రేపు ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సీఎం.. విమానంలో బయల్దేరి ఉదయం 10.40 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 10.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరి 11 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని.. ఉదయం 11.25 గంటల నుంచి 11.40 వరకు తిరుపాల్ రెడ్డి మనవడి వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.10 గంటలకు పులివెందుల హెలిప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు పులివెందుల గెస్ట్ హౌస్‌ చేరుకుని.. మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.. సాయంత్రం 4.40 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి గన్నవరం చేరుకుని.. సాయంత్రం 5.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.

Show comments