CM YS Jagan Speech At Global Investors Summit 2023: విశాఖపట్టణం వేదికగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా.. ఈ సమ్మిట్ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో భాగంగా రెండో రోజైన శనివారం ఏయూ గ్రౌండ్స్‌లో కొన్ని నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ఆయన.. గత మూడున్నరేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. కోవిడ్ కష్టాలను కూడా అధిగమించామని పేర్కొన్న ఆయన.. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయన్నారు. ఇప్పుడు కీలక సమయంలో ఈ సదస్సు నిర్వహించామని.. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నామని చెప్పారు.
Abdullapurmet Case: నవీన్ హత్య కేసు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు
గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా 15 సెక్టార్లలో సెషన్స్ నిర్వహించామని.. ఈ 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయని సీఎం జగన్ పేర్కొన్నారు. రెండు రోజులపాటు సాగిన ఈ సదస్సుల్లో 352 ఎంవోయూలు జరిగాయని.. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. వందకుపైగా స్పీకర్లు పాల్గొన్నారని అన్నారు. ఈ పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందన్నారు. ఎనర్జీ రంగంలో రూ.8,84,823 కోట్లు పెట్టుబడులు వచ్చాయని.. పర్యాటక రంగంలో 117 MOUలు జరిగాయని.. పర్యాటక రంగంలో రూ.22వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని.. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
GIS 2023: రెండో రోజు ఏపీ ప్రభుత్వం కీలక ఎంవోయూలు.. ఏయే కంపెనీలు ఎంత పెట్టుబడి?