Site icon NTV Telugu

ప్రాజెక్టుల కోసం అదనపు సిబ్బంది నియామకం..! సీఎం ఆదేశాలు

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల దగ్గర సమగ్ర పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణ పరిస్థితులు సరిదిద్దాలన్నారు. రాష్ట్ర విభజన నుంచి వీటి గురించి పట్టించుకోలేదు.. దీని వల్ల ముప్పు పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా తగినంత మంది నిర్వహణా సిబ్బంది ఉన్నారా లేదా అనే లెక్కలు తీయాలని.. అవసరమైన సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు.. ఇక, గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల పురోగతిని కూడా సమీక్షించారు సీఎం వైఎస్‌ జగన్.. సీఎస్ అధ్యక్షతన జవనరుల శాఖ స్పెషల్‌ సీఎస్, ఇంజినీర్‌ఇన్‌ ఛీఫ్‌, రెవిన్యూ–విపత్తు నిర్వహణ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో ఇప్పటికే కమిటీ ఏర్పాటు కాగా.. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఛైర్మన్‌గా ఐఐటీ, జేఎన్‌టీయూ నిపుణులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు..

Read Also: అన్ని డిమాండ్లకు అంగీకారం.. సుదీర్ఘ పోరాటానికి తెరదించిన రైతులు

వివిధ ప్రాజెక్టులు, నిర్వహణలపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా పరిశీలిస్తోంది అత్యున్నతస్థాయి కమిటీ.. తాజాగా వచ్చిన వరదలను, కుంభవృష్టిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన సూచనలు చేయనున్నారు.. ఆటోమేషన్‌ రియల్‌టైం డేటాకూ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించే వ్యవస్థపై చీఫ్‌ సెక్రటరీతో కూడిన అత్యున్నత బృందం దృష్టి సారించిదని సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు అధికారులు.. అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించనున్నారు.. వాటర్‌ రెగ్యులేషన్‌ కోసం సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.. పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తి, ప్రాణ నష్టానికి ఆస్కారమున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించే పనిని కూడా కమిటీ చేస్తోందని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version