Site icon NTV Telugu

YS Jagan: సీఎం సమీక్ష.. ఒకటి రెండు ఘటనలతో వ్యవస్థకే చెడ్డపేరు..!

కరోనా ప్రారంభమైన తర్వాత ఈ మధ్యే ఏపీలో జీరోకు పడిపోయాయి కోవిడ్‌ కేసులు.. అయితే, దేశవ్యాప్తంగా మళ్లీ రోజువారి కేసులు పెరగడం మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.. మరోవైపు, కోవిడ్‌ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.. క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌ కీలక సూచనలు చేశారు.

Read Also: Kiara Advani : హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్… హీరోయిన్ ఎపిక్ రిప్లై

కోవిడ్‌ నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్.. అలాగే నిన్నటి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్న సీఎం.. అలాగే ఆరోగ్యమిత్రల కియోస్క్‌ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్‌ప్లే అయ్యేలా చూడాలన్నారు.. ఇక, 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలని సూచించారు.. ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్న ఆయన.. ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని.. అలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్‌ ఉండాలని స్పష్టం చేశారు.

ఇక, విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.. అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలి.. దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టంగా ఉండాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత గట్టిగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్య, వైద్యం–ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలి.. ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవే అంటూ అధికారులుకు నిర్దేశం చేశారు సీఎం వైఎస్‌ జగన్..

Exit mobile version