NTV Telugu Site icon

YS Jagan Mohan Reddy: టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలపై సీఎం జగన్‌ ఫోకస్‌

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

గత ఎన్నికల్లో సూపర్‌ విక్టరీ కొట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.. ఓవైపు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచిన స్థానాలపై ఫోకస్‌ పెట్టి.. ఎప్పటికప్పుడు.. వెనుకబడిన ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు ఇస్తూ అప్రమత్తం చేస్తున్న ఆయన.. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ గెలిచిన స్థానాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు.. ఇక, ఇవాళ మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత జగన్.. సాయంత్రం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది.. మండపేట నియోజకవర్గ ఇంఛార్జి తోట త్రిమూర్తులు సహా 60 మంది పార్టీ నేతలు హాజరుకానున్నారు..

Read Also: Tammineni Sitaram: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధాని కావాలి

అయితే, మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టింది.. 2009 ఎన్నికల నుంచి వరుసగా టీడీపీ ఖాతాలోనే ఉంది మండపేట.. కానీ, ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్.. ఈ సమావేశంలో ఆ అసెంబ్లీ నియోజకవర్గ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 175 స్థానాల్లో విజయం సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. పని విధానంలో వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే.

Show comments