వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటన మొదలైంది. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ నుంచి ఆయన బయలుదేరారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకుంటున్నారు జగన్. బుధవారం తన పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు.
మంగళవారం ఒకవైపు వర్షం కురుస్తోన్నప్పటికీ సీఎం వైయస్ జగన్ వరద బాధితులకు వద్ద వెళ్లి పరామర్శించారు. వారికి తానున్నాంటూ భరోసా ఇచ్చారు. అలుపెరగకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లంక గ్రామాల్లో మొదటి రోజు పర్యటించారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక గ్రామంలో సీఎం వైయస్ జగన్ ఇంటింటికి తిరిగి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులందరినీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏ వరద బాధితుడికి సహాయం అందలేదనే మాట రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గంటి పెదపూడి లంక గ్రామానికి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. ఏ సీజన్ లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఆ సీజన్‌లోనే పరిహారం అందజేస్తామన్నారు. పశువులకు ఎటువంటి కష్టం రాకుండా చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయిస్తానని సీఎం వైయస్ జగన్ హామీ ఇచ్చారు.
-
ప్రధాని మోడీని కలుస్తా.. మీ గురించి చెబుతా..
ముంపు గ్రామాల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించడానికి చర్యలు వేగవంతం చేస్తాం అన్నారు సీఎం జగన్.. పరిహారం అందనివారికి మరింత గడువు ఇచ్చి పూర్తి పరిహారం ఇస్తామని స్పష్టం చేసిన ఆయన.. ముంపు గ్రామాలను తరలించేందుకు వారికి త్వరగా పరిహారం అందించేందుకు కృషి చేస్తాం అన్నారు. పరిహారం చెల్లించేందుకు 20వేల కోట్లు అవసరం వుంది.. దీనికి కేంద్రం నుంచి సహకారం అవసరం అన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోరామని.. ముంపు ప్రాంతాల్లో నేను పర్యటించా.. ప్రత్యక్షంగా వారి పరిస్థితిని చూసి వచ్చా.. పోలవరం నిర్వాసితులంతా మిమ్మల్నే తిట్టుకుంటున్నారు అని చెబుతానన్నారు.
-
నిర్వాసితుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తా
పోలవరం నిర్వాసితుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.. ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఏలూరు జిల్లా వేలేరుపాడులో బాధితులతో మాట్లాడిన ఆయన.. పరిహారం అందించాకే ప్రాజెక్ట్ లో నీళ్ళు నింపుతామని స్పష్టం చేశారు.. ఇక, వరద సమయంలో అధికారులు సమర్థవంతంగా పని చేశారని గ్రామస్తులు తెలిపారు.. 27 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడం చాలా అరుదు.. అలా వస్తే ఎంత మునుగుతుంది అనేది సర్వే చేయాలని.. 45 కాంటూరు పరిధిలో ఉన్న ఇల్లు కూడా మునిగిపోయాయి.. వారందరికీ న్యాయం చేస్తామని తెలిపారు సీఎం జగన్.
-
తిరుమలపురంలో సీఎం జగన్
వరద ప్రభావి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తిరుమలపురం లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జీబిషన్ ను పరిశీలించారు సీఎం జగన్..
-
చట్టి గ్రామంలో జగన్ పర్యటన
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. చట్టి గ్రామస్తులకు పదివేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇస్తున్నా. కేంద్రం నుంచి రావాల్సిన సాయం కోసం పోరాడాల్సి వస్తోంది. స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి మాట్లాడా. పోలవరం కోసం మొదట్లో త్యాగాలు చేసిన నిర్వాసితులకు పరిహారం పెంచి ఇస్తామని, సెప్టెంబర్‌లోగా చెల్లించి తీరతామని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్.
-
ఇంత మానవత్వం వున్న ప్రభుత్వం వేరేది లేదు
నా హయాంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వను. నేను రాసిస్తాను. పోలవరం నిర్వాసితులకు భరోసా నింపే ప్రయత్నం చేశారు జగన్. ప్రపంచంలో ఇంతలా స్పందించే ప్రభుత్వం ఎవరిదీ లేదన్నారు జగన్. ఎవరితోనైనా పోరాడి మీకు రావాల్సింది ఇప్పిస్తా అన్నారు. కొయుగురు గ్రామంలో గ్రామస్తులతో ముచ్చటించాక అక్కడినించి బయలుదేరారు సీఎం జగన్.
-
ఎట్టిపరిస్థితుల్లో మీకళ్ళలో నీరు రానివ్వను
చట్టం ప్రకారం ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబల్ భూములు వుండకూడదు. వారికి పరిహారం ఎలా ఇవ్వాలో చూద్దాం. తమ భూములకు పరిహారం ఇవ్వలేదని ఓ మహిళ జగన్ కి మొరపెట్టుకుంది.పోలవరం అంతా కేంద్రం పరిధిలో వుంది. నోటిఫికేషన్ ఇచ్చాక అన్నీ ప్రారంభం అవుతుంది. నోటిఫికేషన్ వ్యాలిడిటీ మూడేళ్ళే.
-
ఢిల్లీ పెద్దలకు మీ బాధలు వివరిస్తా
త్వరగా ఇస్తే పోలవరం బాధితులు సంతోష పడతారని కేంద్రంపై వత్లిడి తెచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానన్నారు. ఇళ్ళు కట్టించే పని వేగంగా చేస్తానన్నారు. కేంద్రం నుంచి వచ్చే పరిహారం వేగంగా వచ్చేలా చూస్తాం. పోలవరం నిధుల గురించి కేంద్రంతో కుస్తీ పడుతున్నాం.కేంద్రం నుంచి పరిహారం ఇవ్వకుంటే.. నేనే ఇస్తానన్నారు. నాలుగు మండలాలకు రెవిన్యూ డివిజన్ వస్తుంది, అది త్వరలో పూర్తవుతుంది. నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వను.
-
మీకు అన్యాయం జరగనివ్వం
కేంద్రం నుంచి నిధులు రావాలని పోరాటం చేస్తున్నాం. ఈ సెప్టెంబర్ నాటికి సాయం అందిస్తాం. పోలవరం బాధితుల్ని తరలిస్తాం. ఇంతటి వరద మళ్ళీ రాదు. 1986న వరద వచ్చింది. మళ్లీ ఇప్పుడు వచ్చింది. తమ ఇబ్బందుల్ని జగన్ కి వెల్లడించిన బాధితులు. 1000 కోట్లు రెండువేల కోట్లు అయితే నేను పట్టించుకునేవాడిని కాదు. వేల కోట్ల వల్ల వేరే గత్యంతరం లేదు. కేంద్రం ఇవ్వాలని వత్తిడి పెంచుదాం. ఏ ఒకరికీ నష్టం కలగకుండా అందరి చేతుల్లో డబ్బులు పెట్టి, వాళ్ళకు కేటాయించిన ఇళ్ళకు తరలిస్తాం.పోలవరం నిర్వాసితులకు సాయం అందిస్తాం. భరోసా ఇవ్వడానికే వచ్చా. ఎక్కడికి వెళ్లడంలేదు. ఇక్కడే వుంటా... మీ బాధలు వింటా... మీకు సాయం చేస్తానన్నారు. పోలవరం ప్రాజెక్టు, పునరావాసంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
-
విలీన మండలాల్లో జగన్ పరామర్శ
వరద బాధితులకు సహాయం అందకుండా వుండాలనే నేను తపన పడుతున్నాను. ప్రభుత్వం ఇచ్చిన బియ్యం, డబ్బులు అందరికీ అందాయా? అని జగన్ ఆరా తీశారు. ఇంత పారదర్శకంగా గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. నాలుగు మండలాల కోసం అధికారులంతా ఇక్కడే వుండిపోయారు. ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూశాం. కలెక్టర్లు, అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. ఎవరూ కూడా నాకు సాయం అందలేదని అనకూడదని అధికారులకు చెప్పాను.
గతంలో సాయం ప్రకటించడమే కానీ అవి అందాయో లేదో చూసింది లేదు. వరద నష్టం అంతా అంచనా వేస్తామన్నారు జగన్. వారిని దిశానిర్దేశం చేశాం. పంట పొలాలు, ఇళ్ళు, ఎవరికి ఎలాంటి నష్టం జరిగినా వారికి సాయం చేస్తాం అన్నారు జగన్.ఎవరికి ఎలాంటి నష్టం జరిగిందో సచివాలయం సిబ్బంది మాకు జాబితా పంపుతారు. వారికి రెండు వారాల్లోగా సాయం చేస్తాం అన్నారు జగన్. రెండునెలల్లో సాయం అందుతుందన్నారు. మంచి జరిగే ప్రతి అడుగు ముందుకేస్తా. అంతా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం మీది, మీకోసం వుంది. మనది ఈ ప్రభుత్వం. పోలవరానికి సంబంధించి ముంపు సమస్యలు అందరికీ తెలుసు. ఆర్ అండ్ ఆర్ పూర్తిగా ఇవ్వాలంటే 20వేల కోట్లు రావాలి. కేంద్రం నుంచి రాలేదు. మేం ఇచ్చింది కేంద్రం నుంచి రావాలి. వారికి లెటర్లు రాస్తున్నాం. బ్రతిమిలాడుతున్నాం. 41.1 మీటర్ల దాకా నీరు నింపం. ఒకేసారి నింపితే డ్యాంకు నష్టం జరుగుతుంది.
-
వరద బాధితులతో జగన్ భేటీ
చింతూరు మండలంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. కుయుగూరు గ్రామంలో బాధితులతో ముఖాముఖికి సర్వం సిద్ధం చేశారు అధికారులు. వరదల వల్ల నష్టపోయిన వారిని పరామర్శించి.. వరద సాయం గురించి నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు జగన్.
-
అబద్ధాలే చంద్రబాబు ఎజెండా
రాజమండ్రిలో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో సి.ఎం. పర్యటనపై ఆయన మాట్లాడారు. అబద్దాలే ఎజెండాగా చంద్రబాబు ఎంచుకున్నారని మంత్రి మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో పని చేసి జనసేన సైనికులతో సి.ఎం. జగన్ జై కొట్టించుకున్నారన్నారు. జగన్ వరద బాధితులకు కొండంత భరోసా ఇచ్చారన్నారు.వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ఉండటం వల్లే వరద సహాయక చర్యలు త్వరగా జరిగాయి. వరద బాధితులకు సహాయం పూర్తయ్యాక సి.ఎం జగన్ పర్యటించారు. చంద్రబాబు ప్రచారం కోసం వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
పది వేల రూపాయలు డిమాండ్ చేస్తున్న జనసైనికులు ఎక్కడైనా సహాయక చర్యల్లో పాల్గొన్నారా? పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదు? అని మంత్రి ప్రశ్నించారు.
-
చింతూరులో జగన్ పర్యటన
అల్లూరి జిల్లా చింతూరు మండలం కుయుగూరు గ్రామంలో తొలుత పర్యటించనున్నారు సీఎం జగన్. ఆపై చట్టి గ్రామంలో వరద బాధితులతో సమావేశమవుతారు. వరద పీడిత ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి స్వయంగా అడిగి తెలుసుకుంటారు. కాసేపటి క్రితం చింతూరుకు చేరుకున్న సీఎం జగన్ అక్కడి స్థానికులతో మాట్లాడుతున్నారు.