Site icon NTV Telugu

YS Jagan Mohan Reddy: సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు.. సీఎం కీలక ఆదేశాలు

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. క్యాంపు కార్యాలయంలో సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాల్ , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు – నేడు కింద పనులు చేయాలని పేర్కొన్నారు.. స్కూళ్ల నిర్వహణా నిధిలానే హాస్టళ్ల నిర్వహణకు కూడా నిధి ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.. ఇక, హాస్టళ్లలో తప్పనిసరిగా వైద్యుల సందర్శన ఉండాలని ఆదేశించారు.. హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్‌ ఛార్జీలను పెంచాలని.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.

Read Also: Sea Waves: తీరప్రాంతంలో అలజడి.. హుదూద్ తర్వాత ఆ స్థాయిలో విరుచుకుపడుతోన్న అలలు..

కాగా, మన పిల్లలను ఏదైనా స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లుకూడా అలాగే ఉన్నాయో లేదో ఆలోచన చేయాలని గతంలోనే అధికారులు సూచించారు సీఎం జగన్.. సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహిం‍చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని, దీని మీద అధికారులు ఎ‍ప్పటికప్పుడు దృష్టి సారించాలని పేర్కొన్నారు. పాఠశాలలకు సంబంధించి తొమ్మిది రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, వీటిని మూడు దశల్లో అమలు చేస్తామని తెలిపారు. ఇక అధికారులు క్రమం తప్పకుండా వసతి గృహాల్లో కనీస సౌకర్యాల ఉన్నాయో లేదో పరిశీలిస్తూ, నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే.

Exit mobile version