ఆంధ్రప్రదేశ్ వైపు మరోతుఫాన్ దూసుకొస్తుంది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫాన్‌గా బలపడింది. అయితే ఈ తుఫాన్ కి ‘మాండూస్’గా నామకరణం చేశారు. కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమైఉన్న తుఫాన్.. పశ్చిమ-వాయువ్య దిశగా పనయిస్తోంది.. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, ఎస్‌ఆర్‌ఎస్పీ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.. ఇప్పటికే జిల్లాల వారికిగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేసే పనిలో ఉన్నారు అధికారులు.. అయితే, తుఫాన్‌పై అప్రమత్తతంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.
Read Also: BRS party: బీఆర్ఎస్ పార్టీ పేరు నాకే కేటాయించాలి.. న్యాయపోరాటం తప్పదు..!
బంగాళాఖాతంలో తుఫాన్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇక, తుఫాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ఇవాళ ఉదయం సీఎంవో అధికారులతో సమావేశమై తుఫాన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్మోహన్‌రెడ్డి.. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. దీంతో, జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు సీఎం జగన్.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయంగా ఉండాలని ఆదేశించారు.