NTV Telugu Site icon

YS Jagan: అది పార్టీకి, కేడర్‌కు నష్టం.. మనం అధికారంలో లేకపోతే కోట్లాది మందికి కష్టం..

Jagan

Jagan

YS Jagan: ప్రజల్లో మీ గ్రాఫ్‌ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం.. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలో జరిగిన గడపగడపకు కార్యక్రమం సమీక్షలో కీలక వ్యాఖ్యాలు చేశారు ఆయన.. గృహ సారథులను, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను పూర్తి చేసుకోవాలి.. ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలి.. వాలంటీర్లను, గృహ సారథులను మమేకం చేయాలి.. వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లాలి.. దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తి చేశాం.. ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.. నెలకు 9 సచివాలయాలను పూర్తి చేయాలి.. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి.. సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది.. రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి.. వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం అన్నారు.

Read Also: CM YS Jagan: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్‌

రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు.. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టు కోవాలని నేను అనుకోను.. ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను అన్నారు సీఎం జగన్‌. మీతో పని చేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు తీసుకొస్తున్నామన్న ఆయన.. ఈ అడుగులన్నీ కూడా దాని కోసమే.. కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నారు.. ప్రతి నియోజకవర్గంలో లక్షల మంది మనపై ఆధారపడి ఉన్నారు.. ప్రజల్లో మీ గ్రాఫ్‌ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం.. మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని.. అందుకే మన గ్రాఫ్‌ పెంచుకోవాలన్నారు. ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి.. అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి.. ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్‌ పెరుగుతుందన్నారు.. నేను చేయాల్సింది.. నేను చేయాలి.. మీరు చేయాల్సిది మీరు.. చేయాలి.. ఈ రెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే.. అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఈనెల 13న జగనన్నకు చెబుదాం కార్యక్రమం.. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్స్‌సెస్‌ను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశంగా తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌.