ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతులు ఇప్పుడు చిచ్చు పెడుతున్నాయి.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది.. దీంతో, దాడులు, ఆందోళనలు, నిరసనలు, బంద్‌లకు వెళ్లిపోయింది పరిస్థితి. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేక బూతులు తిడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.. ఎవరు మాట్లాడని బూతులు ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.. అయితే, దానిని జీర్ణించుకోలేక నన్ను ప్రేమించే వాళ్లు, అభిమానించే వాళ్లు రియాక్షన్ చూపించారని.. దాని ప్రభావం రాష్ట్రంలో కనబడిందని.. కానీ, రెచ్చగొట్టి, వైషమ్యాలను సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఇక, మీ చల్లని దీవెనలతో రెండేళ్లు పాలన అద్భుతంగా సాగిందన్నారు సీఎం వైఎస్ జగన్… ఇదే సమయంలో కొంతమంది కావాలని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి మేలు జరగకూడదు.. ప్రభుత్వ పథకాలు అమలు కాకూడదు.. అలా జరిగితే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుంది.. తమకు మనుగడ ఉండదన్న భయంతోనే.. వాటిని అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, వ్యవస్థలను కూడా మేనేజ్‌చేసే పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు సీఎం వైఎస్ జగన్.
