NTV Telugu Site icon

CM YS Jagan: జులై 4న సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

Ys Jagan

Ys Jagan

CM YS Jagan Chittoor Tour Schedule: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జులై 4వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మొదట ఆయన తన తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరనున్నారు. చిత్తూరుకి ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడ చిత్తూరు విజయా డెయిరీ వద్ద అమూల్‌ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల (సీఎంసీ) ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమిపూజ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగించుకొని.. అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

WhatsApp: మరో అదిరిపోయే ఫీచర్.. ఇకమీదట మెసేజ్ లను ఇలా పంపొచ్చు..

ఇదిలావుండగా.. అమ్మ ఒడి నాలుగో ఏడాది ఆర్థిక సాయం విడుదల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ మూడు కోతుల కథలో ‘చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు అనొద్దు’ అని నీతి చెబుతాయని.. కానీ మన రాష్ట్రంలో ‘మంచి వినొద్దు, మంచి కనొద్దు, మంచి అనొద్దు, మంచి చేయొద్దు’ అనే నాలుగు కోతులున్నాయని కౌంటర్ వేశారు. వారినే దుష్ట చతుష్టయం అని పిలుచుకుంటున్నామన్నారు. అవినీతి సొమ్మును పంచుకోవడం కోసం వారికి అధికారం కావాలని.. నమ్మించి ప్రజల్ని నట్టేట ముంచడమే వారికి తెలిసిన ఏకైక నీతి అని ఆరోపించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉండీ కూడా ఏమీ చేయలేదని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసం 15 ఏళ్ల కిందటే పుట్టిన ఓ దత్తపుత్రుడు (పవన్‌ కళ్యాణ్‌) మన ప్రభుత్వం చేస్తున్న మంచి చూసి జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. మరోసారి అధికారం ఇవ్వండంటూ మేనిఫెస్టోతో చంద్రబాబు మళ్లీ మోసానికి దిగితే.. దత్తపుత్రుడు ఊగిపోతూ నోటికొచ్చింది మాట్లాడుతాడని మండిపడ్డారు.

Pawan Kalyan: పవన్ హెచ్చరిక.. సైలెన్సర్లు బిగించుకోకపోతే, మంత్రుల చిట్టా విప్పుతా