ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1972 డిసెంబరు 21న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించిన ఆయన.. ఓవైపు వ్యాపారం చేస్తూనే.. రాజకీయాల్లోనూ రాణించారు.. 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం అందుకున్నారు.. ఇక, ఈసారి రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో విజయం సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.. అయితే, వైసీపీ శ్రేణులు, సీఎం జగన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ సంబరాలు నిర్వహిస్తున్నారు.. వస్త్ర, అన్నదానాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రెడ్‌క్రాస్‌తో కలిసి భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.. ఇక, రాష్ట్రమంతా మొక్క నాటేందుకు సిద్ధం అయ్యారు..
Read Also: Girl Friend Offer: గర్ల్‌ఫ్రెండ్‌గా మారితే పరీక్షలో పాస్ చేస్తా.. నో చెప్పిన యువతికి ఏమైందంటే?
చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే నెరవేర్చారని మంత్రలు, వైసీపీ నేతలు చెబుతున్నారు.. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారని.. చరిత్రలో ఈ స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం వెచ్చించిన సీఎంలు లేరని ప్రకటించారు.. వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్ జగన్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. క్రీడల పోటీలు, సంస్కృతి కార్యక్రమాలు.. మొక్కలు నాటే కార్యక్రమం ఇలా.. అన్నింటిలోనూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.. సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఇవాళ ఊరూవాడ కేక్‌లు కట్ చేసి సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలకడానికి సిద్ధంఅయ్యారు.. భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అనాథశ్రమాల్లో అనాథలకు వస్త్రాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేయబోతున్నాయి వైసీపీ శ్రేణులు..