Site icon NTV Telugu

Graduate MLC Elections 2022: ఎమ్మెల్యేల ఏకాభిప్రాయానికి సీఎం ఆమోదం… అభ్యర్థులు వీరే..

Graduate Mlc Elections

Graduate Mlc Elections

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? పోటీచేసినవారికి మద్దతు ఇస్తే ఇలా ఉంటుంది? ఎన్నికలకు దూరంగా ఉందమా? అనే సందేహాలు తెర పడింది.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయానికి రావడంతో.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు.. ఆ వెంటనే మూడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు.. ఇక, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకున్నారు.. మొత్తంగా గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై సంబంధిత జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు స్వీకరించారు ముఖ్యమంత్రి.. గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో పెద్దగా మనం ప్రాధాన్యతగా తీసుకోలేదన్న ఆయన.. ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వడమో, ఉత్సాహం ఉన్నవాళ్లు ముందుకొస్తే వారికి అండగా నిలబడ్డమో చేశామన్న ఎమ్మెల్యేలు.. కానీ, శాసనమండలిలో ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలకు మద్దతుకోరితే, మన మద్దతుతో గెలిచిన వారుకూడా ఇవ్వని పరిస్థితులను చూశామని సీఎంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నారు.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మనం పోటీచేయడమే మంచిందని తెలియజేశారు.. ఏకాభిప్రాయాన్ని సీఎంకు నివేదించారు.. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అంగీకరించారు.

Read Also: YS Jagan mohan Reddy: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సీఎం.. వారికి కూడా ఆర్థిక సాయం..

ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్న ఎన్నికల్లోకి మనం వెళ్తున్నాం.. ముందుగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న ఆయన… ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.. ఓటర్ల నమోదు, ప్రచారం, వారు పోలింగ్‌ బూత్‌ వరకు వచ్చి ఓటు వేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఇక, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుందామని తెలిపారు.. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ప్రక్రియ చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. పోటీ, అభ్యర్థులపై తదుపరి నిర్ణయిద్దామని సమావేశంలో స్పష్టం చేశారు సీఎం జగన్.

గ్రాడ్యుయేట్స్‌ స్థానాలకు సీఎం జగన్‌ ప్రకటించిన అభ్యర్థుల విషయానికి వస్తే..

* ఉమ్మడి విశాఖ – విజయనగరం – శ్రీకాకుళం గ్రాడ్యుయేట్‌స్థానానికి ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న ఎస్‌. సుధాకర్‌ పేరు ఖరారు.

* ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డి పేరు ఖరారు.

* ఉమ్మడి కర్నూలు–కడప– అనంతపురం గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి వెన్నపూస రవి పేరు ఖరారు చేశారు సీఎం జగన్.

Exit mobile version