Site icon NTV Telugu

క్యాసినో విషయంలో దొంగ పోలీసులు ఒక్కటయ్యారు: సీఎం రమేష్‌

కేసీనో విషయంలో దొంగ పోలీసులు ఒక్కయ్యారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. గుడివాడకు వెళ్లటం ఖాయం మేము చేయాల్సిన కార్యక్రమం చేసి తీరుతామని సీఎం రమేష్‌ అన్నారు. గుడివాడకు వెళ్ళకుండా ఎందుకు అవుతున్నారు.. క్యాసినో వ్యవహారం తేలుస్తామన్నారు. గుడివాడ డీఎస్పీకి తెలియకుండా మూడు రోజులు క్యాసినో జరిగిందా.. అని సీఎం రమేష్‌ ప్రశ్నించారు. క్యాసినో పేరుతో ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారో చెప్పాలన్నారు.

Read Also: బీజేపీ నేతల అరెస్టులకు సీఎం జగన్‌ బాధ్యత వహించాలి: జీవీఎల్‌


ఆన్ లైన్లో పెట్టి రూ.10 వేలు ఎంట్రీ ఫీజు అని, రూ.50 వేలు ప్యాకేజీలంటూ డబ్బులు వసూలు చేశారు. దీంట్లో పోలీసుల వాటా ఏంత? మిగతా నాయకుల వాటా ఎంత? ఎవరి వాటా ఎంతో ఖచ్చితంగా తేలుస్తామని సీఎం రమేష్‌ పేర్కొన్నారు. ఈరోజు కాకుంటే రేపైనా ఇంతకంకటే ఎక్కువ మందితో ఎవ్వరూ ఆపలేని స్థాయిలో గుడివాడకు వెళ్లి తీరుతామని, క్యాసినో విషయం ఏంటో తేలుస్తామని అప్పుడు ఎవ్వరూ అడ్డుకుంటారో చూస్తామంటూ సీఎం రమేష్‌ హెచ్చరించారు.

Exit mobile version