Site icon NTV Telugu

Cm Jaganmohan Reddy: ఇవాళ అవనిగడ్డలో జగన్ పర్యటన

Cm Ys Jagan

Cm Ys Jagan

ఒకవైపు రాజకీయాల్లో బిజీగా వున్నా.. జిల్లాల పర్యటన విషయంలో జగన్ ఖచ్చితంగా వుంటారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్‌ పత్రాలను అందజేయనున్నారు. గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అవ‌నిగ‌డ్డకు బ‌య‌ల్దేర‌తారు.

Read Also:YCP Social Media: సోషల్‌ మీడియాపై వైసీపీ స్పెషల్‌ ఫోకస్‌.. నియోజకవర్గాల వారీగా టీమ్‌లు..

11 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. గంటన్నర పాటు సాగే బహిరంగ సభలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్రసంగిస్తారు. నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను రైతులకు అందజేస్తారు. సంక్షేమ పథకాల స్టాల్స్‌ను పరిశీలించనున్నారు సీఎం జగన్… అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం. నిషేధిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలు రైతులకు అందజేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
అనంతరం తిరిగి తాడేపల్లి త‌న‌ నివాసానికి చేరుకుంటారు.
Read Also: Bhakthi tv Live Stothra parayanam live: గురువారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే..

Exit mobile version