Site icon NTV Telugu

CM Jagan : నేడు దావోస్‌లో జగన్‌ పర్యటన..

Cm Jagan

Cm Jagan

దావోస్‌ నేటి నుంచి ఈ నెల 26 వరకు వరల్డ్ ఎకనామిక్‌ ఫోరం డబ్ల్యాఈఎఫ్‌ సదస్సు జరుగునుంది. అయితే సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం దావోస్‌కు సీఎం జగన్‌ చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్లిన జగన్‌కు.. జ్యూరిక్‌ ఎయిర్‌పోర్టులో స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తెలుగు ప్రజలు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆరోఖ్యరాజ్‌ తదితరులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.

అయితే నేటి ఉదయం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. తద్వారా డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన, నాణ్యమైన మానవ వనరుల తయారీ, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం వంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది.

Exit mobile version