ఈ నెల 9న ఒరిస్సాకు సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 9న భువనేశ్వర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. ఇక ఈ భేటీ లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం గురించి చర్చించనున్నారు సీఎం జగన్‌. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారు.

చాలా రోజులుగా పోలవరంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ పర్యటనలో ఒడిషా సీఎంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను జగన్ కలవనున్నారు. కాగా నేరడి బ్యారేజ్ నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలనిఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని గతంలో నవీన్ పట్నాయక్‌కు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు.