ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను వివరించారు ముఖ్యమంత్రి. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతిఆయోగ్ పాలకమండలి 7వ సమావేశం జరిగింది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో సమావేశం నిర్వహించింది నీతి ఆయోగ్. పంటలమార్పిడి, నూనె దినుసలు, పప్పు దినుసల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యావిధానం అమలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక పాలనపై సమావేశంలో చర్చ జరిగింది. వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను వివరించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యింది. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగంమీదే ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటే. వ్యవసాయరంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆ రంగానికి మేం అత్యంత ప్రధాన్యత ఇస్తున్నాం. వ్యవసాయరంగంలో ఉన్న రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునేందుకు వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఉచిత పంటలబీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు తదితర పథకాలు, కార్యక్రమాలను రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నాం అన్నారు జగన్.
Kumbham Anil Kumar Reddy : ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్‌కు పెన్షన్లు గుర్తుకు వచ్చాయి
రైతులకు మరింత అండగా నిలవడానికి వారికి భరోసానిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్ స్టాప్ సొల్యూషన్ కింద ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాలద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎం యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ద్వారా నిరంతరం పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నాం అని జగన్ వివరించారు.
దీంతోపాటు ఆర్బీకే స్థాయిలోనే ఇ– క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతగా అమలు చేయడానికి ఇ–క్రాప్ బుకింగ్ దోహదపడుతోంది. ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టాం. రైతులకు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. వారి చెంతకే అవన్నీ కూడా చేరవేస్తున్నాం. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌నుకూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఆర్బీకేల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లనుకూడా ప్రారంభిస్తున్నాం. పంటల మార్పిడి, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులవైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నాం అన్నారు జగన్.
Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీవర్షాలకు అవకాశం
