Site icon NTV Telugu

CM Jagan: రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

Cm Jagan

Cm Jagan

CM Jagan Mohan Reddy Prakasam District Tour Schedule: ఈనెల 24న ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన చీమకుర్తిలో పర్యటించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10:35 గంటలకు చీమకుర్తి చేరుకోనున్నారు. ఉదయం 10:55 గంటలకు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి కళ్యాణమండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:40 గంటలకు తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.

Read Also: Devineni Uma: పోలవరం ప్రాజెక్టు చూడాలంటే.. అనుమతి కావాలని చెప్పడం సిగ్గుచేటు

కాగా సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా మూడు రోజుల క్రితం వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ దినేష్‌ కుమార్, ఎస్పీ మల్లికాగార్గ్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్, ఏఎస్‌పీ నాగేశ్వరరావు కూడా సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు. బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో అధికారులతో మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి ఆధ్వర్యంలో సీఎం జగన్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.

Exit mobile version