CM Jagan: రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Mohan Reddy Prakasam District Tour Schedule: ఈనెల 24న ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన చీమకుర్తిలో పర్యటించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10:35 గంటలకు చీమకుర్తి చేరుకోనున్నారు. ఉదయం 10:55 గంటలకు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి కళ్యాణమండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం బీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:40 గంటలకు తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.
Read Also: Devineni Uma: పోలవరం ప్రాజెక్టు చూడాలంటే.. అనుమతి కావాలని చెప్పడం సిగ్గుచేటు
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
కాగా సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా మూడు రోజుల క్రితం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికాగార్గ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఏఎస్‌పీ నాగేశ్వరరావు కూడా సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు. బీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం బీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో అధికారులతో మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి ఆధ్వర్యంలో సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!