Site icon NTV Telugu

CM Jagan : నేడు ప్రధాని మోడీ, అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ

Jagan Modi

Jagan Modi

హస్తినలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనకు బయలు దేరారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్ర కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. అయితే.. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ఉదయం 11.15 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఆ తర్వాత అమిత్‌ షాతో భేటీ కానున్నారు సీఎం జగన్‌. ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను సైతం కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Haldwani : హల్ద్వానీ హింసలో ఇప్పటివరకు ఆరుగురి మృతి..300 మందికి పైగా గాయాలు

వీటితో పాటు 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్‌ కూడా జగన్‌ కోరే అవకాశముంది. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పన్నుల వాటా చెల్లింపులు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ ప్రయోజనం కలిగించాలని కోరే అవకాశముంది. కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్‌ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం అందించాలని, విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ కోరనున్నట్టు తెలుస్తోంది.

SA20 2024: హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం.. సౌతాఫ్రికా టీ20 ఫైనల్‌కు సూపర్‌ జెయింట్స్‌!

Exit mobile version