ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జగన్ రాజధాని చేరుకున్న వెంటనే సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు.
అయితే.. ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మోడీకి వివరించిన జగన్.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును కూడా వివరించారు. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ కానున్నారు. అయితే అంతకు ముందు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు.
