Site icon NTV Telugu

Andhra Pradesh: రేపు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

Cm Jagan

Cm Jagan

ఏపీ సీఎం జగన్ వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు చేకూరే లబ్ధిని వివరిస్తూ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పలుచోట్ల బహిరంగ సభల్లో చంద్రబాబు హయాంలో ప్రజలకు జరిగిన లబ్ధి ఏమీ లేదని.. ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తోందని మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ మీదా జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంగళవారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

Andhra Pradesh: టీడీపీ నేత వర్ల రామయ్యను కలిసిన మందకృష్ణ మాదిగ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ కర్నూలు పర్యటనకు బయలుదేరనున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గుమ్మటం తండ వద్ద ఇంటిగ్రేటెడ్‌ రెన్యుబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు(గ్రీన్‌కో) వద్దకు చేరుకుంటారు. అనంతరం గ్రీన్‌కో ప్రాజెక్టు పనులకు సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.05 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Exit mobile version