Site icon NTV Telugu

CM Jagan Tour: రేపు సీఎం జగన్‌ కుప్పం పర్యటన… బాబు వస్తారా?

Cm Jagan

Cm Jagan

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. చంద్రబాబు ఇలాకాలో జగన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుప్పంలో ఎలాగైనా పాగా వేయాలని, చంద్రబాబుని ఇంటికే పరిమితం చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. కుప్పం పర్యటనలో భాగంగా జగన్ వైయస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కి చేరుకుని అక్కడినుంచి బయలుదేరతారు జగన్. వాస్తవానికి గురువారం కుప్పం పర్యటనకు జగన్ వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కి వాయిదా పడింది.

Read Also: Hyderabad Traffic: అలా చేస్తే కఠిన చర్యలే.. పోలీసులు స్పెషల్ డ్రైవ్..

10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15 – 12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని, వైయస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. బహిరంగ సభ తరువాత కుప్పం నేతలతో భేటీ అవుతారు. 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదిలా వుంటే సీఎం జగన్ పర్యటనకు విపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడైన చంద్రబాబునాయుడు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం జ‌గ‌న్‌కు ఘ‌నస్వాగ‌తం ప‌లికేందుకు స్థానిక వైసీపీ నేత‌లు భారీగానే ఏర్పాట్లు చేశారు.

కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు మంత్రి. చంద్రబాబు 33 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉండి కనీసం మున్సిపాలిటీ చేయలేకపోయారని.. అలాంటిది కుప్పంను మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్‌గా మార్చి జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని గోడ‌ల‌పై 175కు 175 సీట్లు.. ఫ‌స్ట్ టార్గెట్ కుప్పం అంటూ హడావిడి చేస్తున్నారు. చంద్రబాబుకి ఇప్పటికే ఆహ్వానం పంపారు అధికారులు. సాధారణంగా సీఎం పాల్గొనే కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం వుండదు. కుప్పం టూర్ లో జగన్ ఏం వరాలు ప్రకటిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: Metro Train Dance : మెట్రో రైళ్లో డాన్స్‌ చేస్తూ యువతి రీల్స్‌.. తెగ వైరల్‌

Exit mobile version