NTV Telugu Site icon

CM Jagan: కడప జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!!

Cm Jagan

Cm Jagan

CM Jagan: సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరనున్నారు. మధ్యాహ్నం 3:50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో పర్యటిస్తారు. అదేరోజు సాయంత్రం 5:35 గంటలకు హెలికాప్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు.

Read Also: Increase Credit: క్రెడిట్‌ పెంచుకోండి. ఎన్‌పీఏల పైనా ఫోకస్‌ పెట్టండి.

కాగా సెప్టెంబరు 1న వేల్పుల గ్రామంలోని సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 2వ తేదీన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్‌లో ఉదయం 9 గంటల నుంచి ఉదయం 9:40 గంటల వరకు సీఎం జగన్ ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పులివెందుల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష చేపడతారు. సెప్టెంబర్ 2న సాయంత్రం 5:10 గంటలకు గెస్ట్‌హౌస్‌ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు సెప్టెంబర్ 3న ఉదయం 8:50 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 9:15 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం జగన్ వెళ్లనున్నారు.