NTV Telugu Site icon

CM Jagan: రైతన్నలకు ప్రతి అడుగులో తోడుగా నేనుంటా

Jagan 2

Jagan 2

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లు, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభించారు జగన్. రైతులకు‌ పంపిణీ చేసే ట్రాక్టర్ ను స్వయంగా నడిపారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించేందుకు వై.ఎస్.ఆర్. యంత్రసేవా పథకం ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. వరి ఎక్కువగా పండించే ప్రాంతాలలో కంబైన్డ్ హార్వెస్టర్ లు అందుబాటులోకి తెస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి రైతు భరోసా కేంద్రంలో యంత్ర పరికరాలు‌ అందుబాటులోకి‌ తెస్తున్నాం అని చెప్పారు. రైతులకు ప్రయోజనకరంగా వుండేందుకు 3వేల 800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ చేస్తున్నాం అని చెప్పారు జగన్.

175.60కోట్ల సబ్సిడీని రైతులకు సబ్సిడీ వారి ఎకౌంట్లలో వేస్తున్నాం. చంద్రబాబు హయాంలో అరకొర రాయితీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ట్రాక్టర్ పంపిణీలో అవినీతికి‌ పాల్పడ్డారు. అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారులకు‌ అందిస్తున్నాం. వై.ఎస్.ఆర్. యంత్రసేవా పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్. రైతులు తమకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చన్నారు. తేడా ఎలా వుందో చూడమని కోరుతున్నాను. రైతులకు ఏంకావాలో వారే ఎంచుకోవచ్చు.సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. అవినీతి లేకుండా వ్యవస్థను క్లీన్ చేస్తున్నాం. ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు సీఎం.

Jagan Guntur Tour