ఏపీ సీఎం జగన్ స్విట్టర్లాండ్ బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్ కు పయనం అయ్యారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు. సీఎం అయిన తరువాత జగన్ లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. అయితే ఇప్పుడు సీఎం హోదాలో జగన్ దావోస్ వెళ్ళారు.
మే 22నుంచి 26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొనున్నారు. కోవిడ్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్ వేదిక కానుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారం కోసం ఈవేదిక ద్వారా ఏపీ భాగస్వామ్యం అవుతుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్ వేదికగా సీఎం జగన్ కీలక చర్చలు కూడా జరపనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలనుకూడా ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం జగన్ వారికి వివరించనున్నారు. కాగా ఈ సమ్మిట్‌కు సంబంధించి గతంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. వాస్తవానికి ఈ సమ్మిట్ గత డిసెంబరులోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరిగిన కారణంగా సమ్మిట్ నిర్వహణ వాయిదా వేశారు. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్‌గా జరుగుతున్నాయి. ఇప్పుడు నేరుగా జరగబోతున్నాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో ప్రతి ఏడాది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది దావోస్ వెళ్లేవారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం దావోస్‌లో జరిగే సమ్మిట్ కోసం అక్కడికి వెళ్ళారు.
CM KCR : నేడు జాతీయ పర్యటనకు కేసీఆర్..