NTV Telugu Site icon

CM Jagan : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా

Cm Jagan Plenary

Cm Jagan Plenary

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్లీనరీ వేడుకలు గుంటూరు వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. నేడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో గల దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద కుటుంబ సమేతంగా సీఎం జగన్‌ నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్‌ గుంటూరు చేరుకున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో వైసీపీ జెండాను ఆవిష్కరించి వైసీపీ ప్లీనరీ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జనగ్‌ ప్రసంగిస్తూ.. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు అమలయ్యాయా అని అడిగితే వారు చిరునవ్వుతో ఆశీర్వదించారు.మన మేనిఫెస్టోలు చూడడానికి భయపడుతోంది టీడీపీ. చెప్పిన మాటకు కట్టుబడి వుందని వైసీపీ నిరూపించింది. వైసీపీ రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏంటో చూపించింది. గ్రామ పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అవినీతికి, వివక్షకు తావులేకుండా చూపించింది. రైతులపై మమకారం అంటే ఏంటో చూపించింది. అన్నీ చేసి చూపించింది. పరిపాలన ఎలా వుంటుందో చూపించింది. అక్కచెల్లెమ్మల సాధికారిత చాటిచెప్పింది. పిల్లల భవిష్కత్తుని తీర్చిదిద్దేలా చూపించింది. వైద్యారోగ్య వ్యవస్థను చేసి చూపించింది. ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించింది. లంచాలు, అవినీతి లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారని చేసి చూపించింది వైసీపీ అని ఆయన తెలిపారు.

Big News : వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా

మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు అమలయ్యాయా అని అడిగితే వారు చిరునవ్వుతో ఆశీర్వదించారు. మన మేనిఫెస్టోలు చూడడానికి భయపడుతోంది టీడీపీ. చెప్పిన మాటకు కట్టుబడి వుందని వైసీపీ నిరూపించింది. వైసీపీ రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏంటో చూపించింది. గ్రామ పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అవినీతికి, వివక్షకు తావులేకుండా చూపించింది. రైతులపై మమకారం అంటే ఏంటో చూపించింది. అన్నీ చేసి చూపించింది. పరిపాలన ఎలా వుంటుందో చూపించింది. అక్కచెల్లెమ్మల సాధికారిత చాటిచెప్పింది. పిల్లల భవిష్కత్తుని తీర్చిదిద్దేలా చూపించింది. వైద్యారోగ్య వ్యవస్థను చేసి చూపించింది. ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించింది. లంచాలు, అవినీతి లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారని చేసి చూపించింది వైసీపీ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.