NTV Telugu Site icon

Chelluboina Venugopal: వంద రోజుల కూటమి పాలనలో రాష్ట్రం బ్రష్టు పట్టింది..

Venu

Venu

Chelluboina Venugopal: వంద రోజులు కూటమి పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంచి ప్రభుత్వం కాదు ముంచిన ప్రభుత్వం.. చంద్రబాబు రోజుకోక డైవర్షన్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి భయపడిఫోవడం ఎందుకు అని ప్రశ్నించారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లితే ప్రజలు బుద్ది చెప్పుతారు.. పవన్ కళ్యాణ్ ప్రాయోజిత దీక్ష ఎందుకు?.. చంద్రబాబు తిరుమలకు చేసిన అపచారం కోసమా! అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేసినందుకు క్షేమించమని కోరడానికా దీక్ష అని అడిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యి వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి అని చెల్లుబోయిన వేణు డిమాండ్ చేశారు.

Read Also: Period Pain: మహిళలు పీరియడ్ పెయిన్‌తో ఇబ్బందులా.? అయితే ఇలా ఉపశమనం పొందండి..

ఇక, చంద్రబాబు చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్సే అంటూ మాజీమంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. ముగ్గురు ఐపీఎస్ లను అన్యాయంగా సస్పెండ్ చేశారు.. కాకినాడలో జనసేన శాసనసభ్యుడు సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. కొట్టేసి రాజీ చేసుకుంటే చట్టాల పట్ల ప్రజలకు నమ్మకం పోతుంది.. చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని కోరుకున్నట్లు ప్రకటించి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి అని ఆయన ఎద్దేవా చేశారు. టీటీడీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ కు ముందుగా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తిరస్కరించినట్లుగా చూపిన నేతిని లడ్డు తయారీలో ఉపయోగించి ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. సూపర్ సిక్స్ లో ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు.. ప్రతిపక్షాలపై బురద జల్లడం మాత్రం రోజు చేస్తున్నారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.