NTV Telugu Site icon

Adivasi Divas: నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. వేడుకల్లో సీఎం చంద్రబాబు..

Adivasi

Adivasi

Adivasi Divas: ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిపేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు.. విజయవాడలో జరిగే ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆదివాసీలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: Technical Tips: మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ను అధికంగా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

కాగా, నేటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ మేరకు పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో ఏర్పాట్లను పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగే వేడుకలు కావడంతో అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భోజనం, వాహన సౌకర్యాలు, ఆదివాసీ దుస్తులు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే, సీతంపేట ఐటీడీఏ దగ్గర ఉన్న అడవి తల్లిని కొత్త బట్టలు, నాటుకోడి, వేప కొమ్మలు, పసుపు కుంకుమ, కొత్త బుట్ట, చిన్నపాటి పందిరి వేసి అలంకరించనున్నారు. అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేయనున్నారు. తద్వారా ఈ ఏడాది అంతా శుభం జరుగుతుందని ఆదివాసీ ప్రజలు నమ్ముతారు.