Chandrababu: వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
- వరద సహాయక చర్యలపై మంత్రులు.. అధికారులతో ఏపీ సీఎం టెలి కాన్ఫరెన్స్..
- ఫైరింజన్లతో రోడ్లు.. కాలనీలు.. ఇళ్లు క్లీనింగ్ వేగవంతం చేయాలని ఆదేశం..
- నిత్యావసరాతో కూడిన ఆరు వస్తువుల పంపిణీ తొందరగా చేయాలి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: విజయవాడలో ఆరవ రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను సీఎంకు అధికారులు వివరించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల ప్రోగ్రెస్ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే, బుడమేరు వాగుకు గండ్లుపూడ్చి వేత కార్యక్రమంలో రంగంలోకి దిగిన భారత ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం.. యద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి.. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు.
Read Also: Student Suspend: టిఫిన్‌లో నాన్‌వెజ్‌ను పాఠశాలకు తెచ్చిన విద్యార్థి.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
ఇక, అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో వేగంగా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో మూడో గండి పూడ్చివేత పనులు త్వరగా పూర్తి చేయలన్నారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్నారు. నిత్యావసరాతో కూడిన ఆరు వస్తువుల పంపిణీపైనా కూడా ఆయన సమీక్ష చేశారు. ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి బాధితులకు అందిస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్ల ను పిలిపించాలని సీఎం సూచించారు. అవసరం అయితే కొంత పారితోషికం ఇచ్చి అయినా మెకానిక్లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!