Site icon NTV Telugu

CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎర్ర చందనంపై ఆసక్తికర వ్యాఖ్యలు

Cbn

Cbn

CM Chandrababu: ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖల పని తీరుపై ఫీడ్ బ్యాక్ ను విశ్లేషించారు. ఈ సందర్భంగా పలు శాఖలపై సీరియస్ అయ్యారు. హోం, మునిపల్ శాఖ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయం, జైళ్ల శాఖలు పూర్తిగా పని చేయడం మానేశాయని తెలిపారు. అలాగే, రెవెన్యూ శాఖలో ఇంకా 12 శాతం మందిని ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నారు.. ఫిర్యాదుదారులు డిపార్ట్మెంట్ కి రావాల్సిన అవసరం లేకుండా చూడాలని ప్రయత్నిస్తుంటే రెవెన్యూ శాఖ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఫైళ్ళ క్లియరెన్స్ చేయొచ్చు, కానీ ఇంకా మంత్రులు అలవాటు పడడం లేదు అని పేర్కొన్నారు. జిల్లాల నుంచి ఏవైనా రిపోర్ట్స్ కావాలంటే సీనియర్ అధికార్లు, కలెక్టర్లను డిస్టర్బ్ చేయడం కంటే RTGS ను అడిగి తీసుకోండి అని సీఎం చంద్రబాబు సూచించారు.

Read Also: Sandy Master: చిన్నప్పుడు చచ్చిన మేక కళ్ళని ఏడిపించారు.. ఇప్పుడవే సినిమా అవకాశాలు తెస్తున్నాయ్!

అయితే, అక్టోబర్ 2వ తేదీ నుంచి 100 శాతం ఫైళ్లను ఆన్ లైన్ లో ఉంచాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు తప్పు చేశారో తెలుసుకునేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చామన్నారు. అలాగే, ఎర్ర చందనంపై కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్ర చందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. దాని విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని భావించాం.. అయితే. మీరు దాన్ని నార్మలైజ్ చేసేశారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రాపర్ ప్లానింగ్ చేయండి.. ఎర్రచందనం అమ్మకం ద్వారా ఆదాయం రావాలని తెలియజేశారు. ఎందుకు ఇంత గట్టిగా చెపుతున్ననంటే అది యూనిక్, కేవలం శేషాచలం కొండల్లో మాత్రమే ఉంటుంది.. అదే సమయంలో డిమాండు కూడా ఉంటుంది అని చంద్రబాబు వెల్లడించారు.

Exit mobile version