Minister Narayana: రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతులతో అన్న క్యాంటిన్ లను ప్రారంభిస్తారు అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గతంలో 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్లు నిర్వహించాం.. ఇప్పుడు కూడా హైజెనిక్ ఆహారం పేద ప్రజలకు తక్కువ రేటుకు.. అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ అన్న క్యాంటిన్లు ప్రారంభించబోతున్నాం.. రాష్ట్రం మొత్తం ఒకే మెనూ అమలు చేస్తున్నామన్నారు. పేదలకు మూడుపూటలా కేవలం 15 రూపాయలతోనే కడుపు నింపే పథకం ఈ అన్న క్యాంటీన్లు అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్..
అలాగే, గుంటూరులో ఏడు అన్న క్యాంటిన్లు ఆగస్టు 15న ప్రారంభిస్తున్నామని నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ విధానంతో అన్నీ పథకాలను నిర్వీర్యం చేసారు.. వారు విమర్శంంచినట్లు అన్న క్యాంటీన్లో ఎటువంటి అవినీతి జరగలేదు.. సీఎం చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారు అంటూ మంత్రి నారాయణ వెల్లడించారు.