Site icon NTV Telugu

CPI Ramakrishna: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో జగన్ను మించిపోయారు..

Cr

Cr

CPI Ramakrishna: గత 11 ఏళ్లలో బీజేపీ ఏం చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏమీ చేయకపోగా.. ముస్లింలను అడ్డం పెట్టుకుని‌ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.. వక్ఫ్ బిల్లుపై బీజేపీది వైసీపీతో లోపాయకారి ఒప్పందం అని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై పురంధేశ్వరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది.. టీడీపీ ఆలోచన ఏంటో అసలు చెప్పలేదు.. వక్ఫ్ బిల్లుకు రెండు సభలలో అనుకూలంగా ఓటేసి మోసం చేయలేదని టీడీపీ ఎలా అంటుంది.. ఇక, పవన్ కళ్యాణ్ ను ఏం అనలేం.. ఆయనకు రాసిచ్చిన స్క్రిప్టు చదివాడు అని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.

Read Also: Sri Sitaramula Kalyanam Live: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..

అయితే, పేద ముస్లింల కోసమే వక్ఫ్ బిల్లు తెచ్చారని పవన్ కళ్యాణ్ కు స్క్రిప్టు రాసిచ్చారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇప్పుడు ముస్లింలు, రేపు క్రైస్తవులు.. బీజేపీ ఎవరినీ వదిలి పెట్టదు అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అప్పుడన్న మీరు జగన్ ను మించిపోయారు అప్పు తేవడంలో.. రాష్ట్ర అప్పుల పైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని.. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు అని చెప్పి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అన్ని ప్రభుత్వ కార్పొరేషన్ల మీద అప్పులు తీసుకొస్తున్నారు.. ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన రెండు రోజులకే 5 వేల రూపాయల కోట్లకు పైగా అప్పులు చేశారు.. జర్మనీలో KFW ఉందని మనకి తెలీదు.. అక్కడ నుంచీ కూడా అప్పు తెచ్చాడు చంద్రబాబు.. అమరావతి రాజధాని ఒక్కదాని కోసం 62 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చారని సీపీఐ రామకృష్ణ చెప్పుకొచ్చారు.

Exit mobile version