Chandrababu: ఏపీ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్ డెవలప్‌మెంట్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలు పెరగాలి, సిజేరియన్లు తగ్గించాలన్నారు. రెండు జీతాలు, ఒక్క సంతానం చాలని చాలా మంది యువత అనుకుంటున్నారు.. జనాభా పెరుగుదలపై నిశ్శబ్దం వీడి.. చర్చ జరగాలని తెలిపారు. ప్రభుత్వం కూడా జనాభా పెరుగుదలకు తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రసూతి సెలవులు ఎన్ని కాన్పులకైనా ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Minister Lokesh: వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పు..
ఇక, జనాభా నిర్వహణ గురించి ఇప్పుడు చర్చ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అప్పట్లో జనాభా తగ్గుదల గురించి గట్టిగా పని చేశా.. 20 ఏళ్ల తర్వాత ప్రస్తుతం జనాభా పెరుగుదల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయి.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చేలా అమరావతి నిర్మాణం కొనసాగుతుంది.. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విస్తరణకు అవసరమైన భూమి, నీరు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.