NTV Telugu Site icon

Ambati Rambabu: దేవుడిని అడ్డం పెట్టుకుని జగన్పై కక్ష తీర్చుకోవద్దు..?

Ambati

Ambati

Ambati Rambabu: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, తెలుగు ప్రజల మధ్య తిరుమల లడ్డూపై చర్చ జరుగుతుంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ను రాజకీయంగా అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ పై బురద చల్లుతున్నారు.. బుడమేరు, ఏలురుకు వచ్చిన వరదను కూడా జగన్ మీద ఆరోపణ చేస్తున్నారు.. ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర చేశారని జగన్ పై ఆరోపణ చేశారు.. అలా చేసిన ఆరోపణల కుట్రలో భాగమే లడ్డూపై చేస్తున్న వివాదం అని ఆయన పేర్కొన్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని చెప్పడం దుర్మార్గం అని అంబటి రాంబాబు అన్నారు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఫిర్యాదు..

అయితే, ఇవి టీడీపీ నాయకుల అనుమానం మాత్రమే.. లడ్డూలో గాని నెయ్యిలో గాని కల్తీ జరిగిట్లు నిరూపణ అయితే చర్యలు తీసుకోవచ్చు అని మాజీమంత్రి రాంబాబు అన్నారు. రెండు నెలల క్రితం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన సమాచారం మీరు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఇక, డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది టెస్టులకు పంపించిన మూడు నెయ్యి కంటైనర్ లు ఎవరి హయాంలో వచ్చాయి?.. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలలో గతంలో కల్తీ ఉందని అనుమానంతో అనేక సార్లు కొన్ని నెయ్యి కంటైనర్లను రిజక్ట్ చేశారు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read Also: Rahul Gandhi: ‘‘సిక్కు’’ వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వీడిన రాహుల్ గాంధీ.. బీజేపీపై ఆరోపణలు..

ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కోట్ల మంది లడ్డూ ప్రసాదం స్వీకరించారు.. ఇప్పుడు చంద్రబాబు వచ్చి జంతు కొవ్వు అని చెప్పి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు అంటూ అంబటి రాంబాబు తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీవారి ఆలయంలో ప్రమాణం చేసి చెప్పాలి అని డిమాండ్ చేశారు. దేవుడ్ని అడ్డం పెట్టుకొని జగన్ పై కక్ష తీర్చుకోవొద్దు.. జగన్ పై కోపం ఉంటే వేరేలాగా తీర్చుకో.. దేవుడు పేరు చెప్పి చంద్రబాబు లడ్డూలా దొరికి పోయాడు.. ఆ వేంకటేశ్వరుడు చంద్రబాబు సంగతి చూస్తాడంటూ మాజీమంత్రి రాంబాబు మండిపడ్డారు.