CM Chandrababu: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు క్రమ శిక్షణ గీత దాటుతున్న నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలోని వివాదాలతో పాటు పలు నియోజకవర్గాల్లోని నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పార్టీ ముఖ్య నేతలు పేర్కొన్నారు.
Read Also: Jemimah Rodrigues: అంతా దేవుడే చూసుకున్నాడు.. కన్నీటి పర్యంతమైన జెమీమా!
అయితే, పార్టీ కమిటీల సమన్వయం, నాయకత్వ మార్పులు లాంటి అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో పాటు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, పార్టీ కమిటీల పని తీరుతో పాటు కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించే దిశగా సమావేశం కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది.
