Site icon NTV Telugu

CM Chandrababu: టీడీపీ ఎప్పటికి గుడివాడకు రుణపడి ఉంటుంది..

Babu

Babu

ఏపీలో అన్న క్యాంటీన్ ను సతీసమేతంగా సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మొదటి అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు. పేదలతో పాటు అన్న క్యాంటీన్ లో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పేదలకు చంద్రబాబు దంపతులు భోజనం వడ్డించారు. అలాగే వారితో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్లకు విరాళాలు అందుతున్నాయి.. రాబోయే 23 ఏళ్ళలో సంకల్పం చేసి ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అవుతామన్నారు. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసే వాళ్ళం అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Pawan kalyan: కూతురుతో పవన్ కల్యాణ్ సెల్ఫీ.. పిక్ వైరల్!

కాగా, 2019లో ఒక సైకోను తెచ్చుకున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అప్పటి నుంచీ బూతులే బూతులు‌.. తెలుగు దేశం పార్టీ గుడివాడకు రుణపడి ఉంది.. గుడివాడ నియోజకవర్గంలో ఇలాంటి సమావేశం జరిగిందా అని అందరు అనుకోవాలి తెలిపారు. అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అయ్యాను.. ఎక్కడైనా భూకబ్జాలు కనిపిస్తున్నాయా.. రచ్చబండే నా స్టేజీ.. సింపుల్ గవర్నమెంట్ ఉండాలి‌‌.. ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇవ్వమని ఒక మహిళ కోసం ఆదేశించాను.. నా జీవితాంతం ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేస్తా‌.. అలాగే, సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతోంది.. జీరో పావర్టీ చేయాలన్నది నా బాధ్యత‌.. సంపద ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదు అంటూ చంద్రబాబు వెల్లడించారు.

Exit mobile version